Star Actors: సినిమా ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. తెలుగు సినిమాలు మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా తెలుగు హీరోలు వందల కోటలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోలకు ఇంత మంచి క్రేజ్ రావడానికి కారణం ప్రేక్షకులని చెప్పాలి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిన తర్వాత ఎంతోమంది ఇతర భాషా హీరోలు కూడా తెలుగు ఇండస్ట్రీపై కన్నేశారు.

వారు నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ల కోసం హైదరాబాద్ ఆంధ్ర వంటి ప్రదేశాలకు వస్తూ మాకు తెలుగు ప్రేక్షకులు అంటే అభిమానం తెలుగు రాష్ట్రాలు అంటే అభిమానం అంటూ గొప్పలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నా కూడా ఇతర భాష హీరోలు మాత్రం ఈ సంఘటనలపై స్పందించిన దాఖలాలు లేవు.

తెలుగు ప్రేక్షకులు అంటే అభిమానం అని చెప్పిన హీరోలు ఆ తెలుగు ప్రేక్షకులు ఆపదలో ఉంటే కనీసం సహాయం చేయటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన వరదల కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కోట్ల రూపాయల విరాళం అందించారు.

ఈ క్రమంలోనే తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజినీకాంత్,విజయ్ దళపతి, ధనుష్, సల్మాన్, షారుఖ్ ఖాన్, మోహన్లాల్, మమ్ముట్టి వంటి హీరోలు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఈ ఘటనపై స్పందించిన దాఖలాలు లేవు. ఇక రియల్ హీరో సోనుసూద్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించి తన ట్రస్టు ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఒక్కరు సాయం ప్రకటించలేదు..
ఇక పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఏదైనా ఆపద వస్తే మన తెలుగు హీరోలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందిస్తారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఆపదలో ఉంటే ఈ హీరోలలో మానవత్వం కూడా పూర్తిగా కరువైందని ఈ విషయంలో మా హీరోలను చూసి మారండి అంటూ పలువురు అభిమానులు ఇతర భాష హీరోలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.