• తమిళగ వెట్రి కజగం పార్టీకి గుడ్ న్యూస్
  • ఇక పూర్తీ స్థాయి రాజకీయాల్లో విజయ్
  • త్వరలోనే భారీ బహిరంగ సభ

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. ఆగస్టు నెలలో రెండు ఏనుగులు పోలివుండే TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్.

Also Read: MathuVadalara2 : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసారా.. ట్రైలర్ రిలీజ్

తాజాగా ఎన్నికల సంఘం నుండి తమ పార్టీకి గుర్తింపు లభించిందని ఇక తమిళనాడును అభివృద్ధి పథంలో విజయపథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యం అంటూ లేఖ విడుదల చేసాడు విజయ్. అతి త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నాడు. అదే విధంగా విజయ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించాడు. తమిళనాడు లోని విల్లుపురం వేదికగా జరిగే TVK పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 21 నిబంధనలతో సభకు అనుమతి ఇచ్చారు అధికారులు. దింతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.  కాగా విజయ్ నటించిన తాజా చిత్రం గోట్ ఇటీవల విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అలాగే విజయ్ చివరి సినిమాను హిట్ దర్శకుడు H. వినోద్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. 2029 ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. సినిమాలలో స్టార్ గా రాణించిన విజయ్ రాజకీయాలలో ఏ మేరకు రాణిస్తాడోనని ఎదురుచూస్తున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు