• గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటిబడింది
  • క్రీడలకు ఆదరణ తగ్గించారు
  • క్రీడలు అభివృద్ధికి రాజమండ్రి నుంచి నాంది పలుకుతాం
  • కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు

గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటిబడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రీడలకు ఆదరణ తగ్గించారని.. క్రీడలు అభివృద్ధికి రాజమండ్రి నుంచి నాంది పలుకుతాని పేర్కొన్నారు. రాజమండ్రిలో సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమన్నారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పేదల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేక అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించలేకపోతున్నారని తెలిపారు.

READ MORE: Duvvada Family Issue: మీడియా ముందు ఎమ్మెల్సీ దువ్వాడకు మాధురి ఫోన్‌.. ఇంటి రిజిస్ట్రేషన్‌పై క్లారిటీ

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందులు దుర్గేష్, రాంప్రసాద్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ పోటీల్లో ఐదు రాష్ట్రాల నుంచి 150 మంది క్రీడాకారులు పోటిపడుతున్నారు. కాగా.. యోనెక్స్-సన్‌రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2024 పోటీలు రాజమండ్రిలో 8వ తేదీ నుంచి 11 సెప్టెంబర్ వరకు జరగనున్నాయి.

READ MORE:Tamannaah Bhatia: నా జీవితంలో రెండు బ్రేకప్స్‌.. బాంబ్ పేల్చిన తమన్నా!

ఇదిలా ఉండగా.. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన దిలీప్ ట్రోఫీలో ఇండియా ‘D’ పై ఇండియా ‘C’ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. కాగా.. అభిషేక్ పోరెల్ 35 పరుగులతో, మానవ్ సుతార్ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రెండో ఇన్నింగ్స్లో ఇండియా ‘సి’ జట్టులో ఆర్యన్ జుయల్ అత్యధికంగా (47) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46), రజత్ పటిదార్ (44), సాయి సుదర్శన్ (22) పరుగులు చేశారు.