వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు అనేక రికార్డులను క్రియేట్ చేస్తూ, మరికొన్ని బ్రేక్ చేస్తూ ఈ చిత్రం సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “అల వైకుంఠపురంలో” వారం రోజుల్లో 180 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించగా, “సంక్రాంతికి వస్తున్నాం” ఆ రికార్డును ఆరు రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం. దిల్ రాజు సమర్పణలో, ఆయన సోదరుడు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మరో మైలిస్టోన్ సాధించింది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ రాబట్టి, ఈ సినిమా 6వ రోజు కలెక్షన్లలో “RRR” రికార్డును అధిగమించింది. రాజమౌళి తెరకెక్కించిన “RRR” 6వ రోజు 9 కోట్ల షేర్ సాధించగా, “సంక్రాంతికి వస్తున్నాం” కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్క్ దాటిన ఈ సినిమా, ప్రేక్షకుల ఆదరణతో కొనసాగుతుందని అంచనా. సంక్రాంతి సీజన్‌కి అద్భుతమైన కానుకగా మారిన “సంక్రాంతికి వస్తున్నాం”, వెంకటేష్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *