Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ పచ్చ జెండా ఊపింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్‌ ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ను ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఓ లేఖను పంపింది. ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.