Nithya Menon: నిత్యామీనన్ సౌత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారని ఈమె మలయాళీ అమ్మాయి అని అందరికీ తెలిసిందే. ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నిత్యమీనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు సంబంధించి ఒక రహస్యాన్ని బయటపెట్టారు. ఇప్పటివరకు నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి అని చాలామంది అనుకునే వారు అయితే తాను మలయాళీ అమ్మాయిని కాదనే షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

తన పేరు పక్కన మీనన్ అని ఉండటం వల్ల ప్రొడక్షన్ హౌస్ వాళ్లు కూడా కొచ్చికి టికెట్ వేయమంటారా అంటూ మాట్లాడేవారు అప్పుడు నాకు చాలా నవ్వొచ్చేది. నిజానికి నేను బెంగళూరు వాసిని మా కుటుంబ సభ్యులు మూడు తరాల నుంచి అక్కడే ఉన్నారు. ఇక నా అసలు పేరు ఎన్ ఎస్ నిత్య. ఎన్ అంటే తన తల్లి పేరు నళిని ఎస్ అంటే తన తండ్రి సత్య కుమార్ పేర్లను కలిపి ఈమె ఇలా పెట్టుకున్నారు.

ఎన్ఎస్ నిత్య…
ఇక పాస్ పోర్ట్ కోసం మీనన్ అనే పేరును పక్కన జత చేసుకున్నానని అది కూడా న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన మీనన్ అని చేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని, అలాగే తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి నిత్యమీనన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.