Translate this News:
Health Tips: మొక్కజొన్న ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఐటమ్స్. వర్షాకాలంలో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి కణజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్- బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. రోజు కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే ఎలాంటి ఆరోగ్య ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..
రోగనిరోధక శక్తి:
- మొక్కజొన్నలు విటమిన్-ఏ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. దీనిని కాల్చి తినడం వలన రోగనిరోధకశక్తి అధికంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
జీర్ణ సమస్యలు:
- మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారు కాల్చిన మొక్కజొన్న తింటే సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఉడకబెట్టుకొని తిన్న మంచి ఫలితం ఉంటుంది.
కళ్ళకు మంచిది:
- మొక్కజొన్నను డైట్లో చేయించుకుంటే కంటిచూపు మెరుగు పడుతుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అందుకే దీనిని ఆహారంలో భాగం చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్:
- బయట ఫుడ్డ్ తినడం వల్ల చాలామందికి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మొక్కజొన్నలో కాల్చుకొని తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మొక్కజొన్నలో ఫైబర్ వంటి లక్షణాలు సమస్యను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
క్యాన్సర్:
- ఈ మధ్యకాలంలో ఈ సమస్య ఎక్కువగా అందరినీ వేధిస్తుంది. ఈ క్యాన్సర్ సమస్య తగ్గాలంటే మొక్కజొన్నను తినాలి. దీనిని తినడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా ఉంచి క్యాన్సర్ వంటి కణాలను నాశనం చేస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
[vuukle]