“పుష్ప 2” సినిమా విడుదలై ఒక నెల అయినప్పటికీ, ఇంకా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జవనరి 17 నుండి 20 నిమిషాల కొత్త సీన్స్‌తో “రీ లోడెడ్ వెర్షన్” విడుదల చేయడంతో, ఈ చిత్రం మరోసారి థియేటర్లలో హిట్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు థియేటర్‌లలో రచ్చ చేస్తున్నారని తెలుస్తోంది. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ ప్రభావం బాగా కొనసాగుతుంది. ఇప్పటివరకు “పుష్ప 2” 1850 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ విజయంపై, బన్నీ తదుపరి ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొనసాగించనున్నాడు. గతంలోనే ఈ సినిమా ప్రకటన చేయగా, ఇప్పుడు ప్రత్యేకమైన అనౌన్స్మెంట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెలాఖరులో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

అంతేకాక, అల్లు అర్జున్ తన కొత్త లుక్‌తో ప్రత్యేకమైన వీడియోని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రానున్నట్లు అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో “జులాయి”, “సన్ ఆఫ్ సత్యమూర్తి”, “అల వైకుంఠపురములో” వంటి భారీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈసారి, బన్నీ, త్రివిక్రమ్ మరింత విశేషమైన సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మైథలాజికల్ టచ్‌తో భారీ బడ్జెట్ సినిమా అందించేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

“పుష్ప 2” తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ, ఈ ప్రాజెక్టులో మరింత ఘనంగా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *