• గీత ర‌చ‌యిత గురుచ‌ర‌ణ్ కన్నుమూత
  • రెండు వందలకు పైగా సినిమా పాటలు
  • మోహన్‌బాబుకు ఇష్టమైన రచయిత

Lyricist Gurucharan Passed Away: టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ సినీ గీత ర‌చ‌యిత గురుచ‌ర‌ణ్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం హైదరాబాద్‌ రహమత్‌ నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గురుచ‌ర‌ణ్ కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయనకి భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. గురుచరణ్‌ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్‌. ఒకప్పటి ప్రముఖ నటి ఎంఆర్‌ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడే ఈ గురుచరణ్‌.

Also Read: Regina Cassandra: ఎన్నో రిలేషన్‌షిప్స్ ఉన్నాయి.. నేను ఓ సీరియల్ డేటర్‌ను: రెజీనా

ఎంఎ చదివిన గురుచ‌ర‌ణ్ ప్రఖ్యాత రచయిత ఆచార్య ఆత్రేయ శిష్యుడు. ఆయన రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. గురుచ‌ర‌ణ్ క‌లం నుంచి జాలు వారిన వాటిలో ‘ముద్ద‌బంతి పువ్వులో మూగ‌బాస‌లు’, ‘బోయ‌వాని వేటుకు గాయ‌ప‌డిన కోయిల’, ‘కుంతీకుమారి తన నోరు జారి’ లాంటి ఎన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. సీనియర్ న‌టుడు మోహ‌న్‌ బాబుకు గురుచ‌ర‌ణ్ అంటే ప్ర‌త్యేక అభిమానం. అందుకే ఆయ‌న నంటించిన సినిమాలో ఒక్క పాటైనా గురుచ‌ర‌ణ్ చేత రాయించేవారు. గురుచరణ్‌ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటు.