చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోయిన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు “చంటి”, “బాబు బంగారం”, “దృశ్యం” వంటి సినిమాల ద్వారా మరింత దగ్గరైంది.
తన భర్త అనిల్ కుమార్ కరోనాతో మృతి చెందిన తర్వాత మీనా చాలా బాధను ఎదుర్కొంది. అయినా సరే ఆమె బలంగా ఉండి తిరిగి సినిమాల్లో నటించడమే కాకుండా తన అభిమానులతో సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్‌గా మమేకమవుతోంది.
ఇటీవల తన స్నేహితురాలి పెళ్లికి హాజరైన మీనా, అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తక్కువ మేకప్‌తో, సింపుల్ లుక్‌లో కనిపించిన మీనా ఆ ఫొటోలతో మరోసారి అభిమానుల మనసులు దోచేసింది. పట్టు చీరలో మెరిసిపోతూ, చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. “ఎప్పటికీ యంగ్ కనిపించే నటి మీనా” అంటూ అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. మరికొంతమంది ఆమె లవ్లీ స్మైలును చూసి మళ్లీ తెరపై చూడాలని ఆకాంక్షిస్తున్నారు.