‘పుష్ప-2’ ప్రీమియర్స్‌కు రంగం సిద్ధం.. ఫస్ట్ షో పడేది అప్పుడేనా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 23, 2024 3:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో వినిపిస్తున్న టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” అని చెప్పాలి. మరి బిజినెస్ పరంగా ఊహించని రికార్డులు సెట్ చేస్తున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

గత కొన్ని రోజులు కితం పుష్ప 2 సినిమా డిసెంబర్ 6 కాదు డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ప్రీ పోన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపించాయి. మరి దీనిపై మేకర్స్ ఓ బిగ్ అనౌన్స్మెంట్ ని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఈ కొన్ని రోజుల్లోనే మేకర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *