ఎన్టీఆర్ స్టార్ పవర్.. “దేవర” విషయంలో అంతా సేఫ్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 26, 2024 1:59 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “దేవర” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ గ్రాండ్ సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేశారు.

అలాగే పార్ట్ 2 లో చాలా ఆసక్తికర ప్రశ్నలకి కూడా తాను సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే పార్ట్ 2 పై క్రేజీ న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో పార్ట్ 2 లో వరతో పాటు దేవర కూడా కనిపించొచ్చు అని తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్ లో దేవర ఖచ్చితంగా చనిపోయినట్టు కూడా చూపించలేదు అని సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులు అంటున్నారు.

అలాగే దేవర పార్ట్ 2 లో ఇద్దరే ఉండాలని లేదు ముగ్గురు కూడా ఉండొచ్చు ఏమో అంటూ దేవర కి వర్క్ చేసిన ఓ ఆర్టిస్ట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి ఇదే కానీ నిజం అయితే మాత్రం దేవర 1 విషయంలో కొంచెం డిజప్పాయింట్ అయ్యినవారు ఖచ్చితంగా పార్ట్ 2 కి ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతారని చెప్పొచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *