- పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు
- అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
- ఈనెల 6న పవర్ ఆలపించిన పాట విడుదల చేస్తామన్న మేకర్స్
- తాజాగా తేదీలో మార్పు ప్రకటించిన బృందం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
READ MORE: Israel: మొస్సాద్ గూఢచారిని బహిరంగంగా ఉరితీసిన సిరియా.. మృతదేహం కోసం ఇజ్రాయిల్ చర్చలు..!
కాగా.. ఇటీవల హరిహర వీరమల్లు లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. జనవరి 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన “మాట వినాలి” అనే సాంగ్ ను ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మేకర్స్ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వెల్లడించారు. పాట యొక్క అత్యుత్తమ వెర్షన్‌ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వివరించారు. అభిమానుల నిరీక్షణకు తగ్గట్టుగానే పాట ఉంటుందని హామీ ఇచ్చారు.