Salman Khan : సల్మాన్‌కు వింత సెంటిమెంట్.. కలిసొచ్చేనా .?

  • వన్ ఆర్ టూ టైమ్స్ కాదు.. 11 సార్లు అదే సెంటిమెంట్
  • మత విశ్వాసమా..? కాసుల వర్షమా..?
  • సికిందర్ కూడా రంజాన్ పండుగకే

సల్మాన్ ఖాన్‌ను ఆ సెంటిమెంట్ వెంటాడుతుందా..? ఒకసారి, రెండు సార్లు కాదు.. రిపీట్‌గా ఫాలో అవ్వడం వెనుక రీజనేంటో సికిందర్ విషయంలో కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల వీరుడు ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఫాలో అవుతున్నాడు. అదే  ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయడం. గత 15 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాడు. వాంటెడ్‌తో స్టార్టైన ఈ సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఈద్ రోజు సినిమా రిలీజ్ చేస్తే ఆ అల్లా ఆశీస్సులు ఉంటాయని బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది సల్లూభాయ్. ఇదే సెంటిమెంట్ నెక్ట్స్ మూవీకి కూడా అప్లే చేయబోతున్నాడు.

2009లో పోకిరీ రీమేక్‌గా వచ్చిన వాంటెడ్ మూవీతో ఈద్ సెంటిమెంట్ స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. ఒకటి కాదు రెండు కాదు మేనీ టైమ్స్ ఇదే రిపీట్ చేశాడు. 2010లో దబాంగ్, 2011లో బాడీ గార్డ్స్, 2012లో ఏక్ థా టైగర్, 2014లో కిక్, 2015లో భజరంగీ బాయ్ జాన్, 2016లో సుల్తాన్, 2017లో ట్యూబ్లైట్, 2018లో రేస్ 3, 2019లో భారత్, 2023లో కిసికా బాయ్ కిసికా జాన్ వరకు ఈ క్రేజ్ కంటిన్యూ అయ్యింది. అంటే మొత్తంగా 11 సినిమాలను ఈద్ పండుగకే తెచ్చాడు కండల వీరుడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తన నెక్ట్స్ సినిమాకు కంటిన్యూ చేయబోతున్నాడు సల్లూభాయ్. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సికిందర్ రిలీజ్ కూడా ఈద్ కే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న సికిందర్ నెక్ట్స్ ఇయర్ రంజాన్ అంటే మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అఫీషియల్ డేట్ త్వరలో ప్రకటించనుంది యూనిట్. ఈద్ టైంలో రిలీజైన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ కావడంతోనే సల్మాన్ ఖాన్ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *