యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల అనే సినిమా చేస్తున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్ చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, వింటేజ్ మేకోవర్ అదిరిపోయింది. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన కొత్త పోస్టర్ శంబాల మీద మరింతగా ఆసక్తి పెంచేలా ఉంది.
Miss You : సిద్ధార్థ్ ‘మిస్ యు’ ఓటీటీ డేట్ ఫిక్స్..?
ఈ పోస్టర్‌లో చూపించిన ఆ పొలం.. ఆ దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఆది సాయి కుమార్, అర్చన అయ్యార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య45లో కీలక పాత్ర పోషించిన లబ్బర్ పందు ఫేమ్ స్వాసిక ఇంపార్టెంట్ కారెక్టర్‌ను పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. హన్స్ జిమ్మర్ వంటి హాలీవుడ్ వ్యక్తులతో కలిసి పనిచేసిన ప్రతిభావంతులైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో శరవేంగా చిత్రీకరణ జరుపుకుంటోంది శంబాల.