
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అభినయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఈ సినిమా రీ-రిసీల్స్ అయ్యి హిట్ అవుతుండగా, అదే సమయంలో అభినయ తన నిశ్చితార్థం గురించి ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసిన అభినయ, తన కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. “మా ప్రయాణం నేటితో ప్రారంభమైంది” అంటూ క్యాప్షన్ ఇచ్చినప్పటికీ, తన భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచింది.
అభినయ గతంలో హీరో విశాల్‌తో ప్రేమలో ఉందంటూ పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ పూజ, మార్క్ ఆంటోని సినిమాల్లో కలిసి నటించడం, ఆపై వారిద్దరి మధ్య పెళ్లి ఊహాగానాలు రావడానికి కారణమయ్యాయి. అయితే, విశాల్, అభినయ ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. విశాల్ అంటే తనకు గౌరవమే కానీ, తన చిన్ననాటి స్నేహితుడినే ప్రేమిస్తున్నానని అభినయ స్పష్టం చేసింది.
దాదాపు 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు తనను అర్థం చేసుకున్న వ్యక్తి అని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యామని చెప్పుకొచ్చింది. అభినయ ఎంగేజ్మెంట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక పెళ్లి తేదీ ఎప్పుడు? అభినయ భర్త వివరాలు ఏంటి? అన్న విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి!