మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. దిలీప్ శంకర్ మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. రెండు రోజుల క్రితం దిలీప్ శంకర్ హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. అయితే అతను అప్పటి నుంచి గది బయటకు వెళ్లలేదని సమాచారం. ఈరోజు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచారు. ఈ క్రమంలోనే దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దిలీప్ శంకర్ పలు సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. ఫ్లవర్స్ టీవీలో ఓ సీరియల్‌లో దిలీప్ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Athiya Shetty: బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన అతియా శెట్టి
హాటల్ చనిపోయినా మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని ప్రాథమిక అంచనా. ఫోరెన్సిక్ బృందం గదిని తనిఖీ చేస్తుందని కన్వెన్షన్ ఎస్పీ తెలిపారు. శంకర్ అకాల మరణం మలయాళ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు చివరి సారిగా ‘పంచాగ్ని’ సీరియల్‌లో చంద్రసేనన్ పాత్రలో కనిపించాడు మరియు ఇటీవల ‘అమ్మయ్యరియతే’లో పీటర్ పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. అతని ‘పంచాగ్ని’ సహనటి సీమా జి నాయర్ తన బాధను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆమె తన నోట్‌లో ‘ఐదు రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు, కానీ నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను’ అని రాసుకొచ్చింది.