సత్యదేవ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ జీబ్రా. థియేటర్ లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబటింది. అయితే ఈ థ్రిల్లర్ చిత్రం జీబ్రాలోని నటీనటులు ధరించే ప్రత్యేకమైన ఉపకరణాలను గెలుచుకోవడానికి అభిమానులకు ప్రత్యేకమైన ఛాన్స్ కల్పిస్తోంది ఆహా. ఈ సినిమాను ఈ డిసెంబర్ 20, 2024న ఆహా OTTలో డిజిటల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
తాజగా నటుడు సత్యదేవ్ , నిర్మాత SN రెడ్డి, నటి ఉషా శ్రీ ఆహా యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) విపిన్ ఉన్ని మరియు కంటెంట్ అక్విజిషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కుమార్ బాలబొమ్మల హాజరైన స్టార్-స్టడెడ్ ప్రెస్ ఈవెంట్‌లో ఈ ప్రకటన చేసారు. ఆహా OTT ద్వారా నిర్వహించబడుతున్న ప్రత్యేక Zebra పోటీలో భాగంగా తనకు ఇష్టమైన వాచ్ మరియు గ్లాసెస్‌ని వ్యక్తిగతంగా అందజేసే అవకాశాన్నికల్పిస్తున్నారు. ఆహా గోల్డ్‌కి సబ్‌స్క్రైబ్ చేసి, సినిమా చూసే అభిమానులు సత్యదేవ్ మరియు నటుడు సునీల్‌తో సహా ప్రధాన తారాగణం ధరించే ఈ ప్రత్యేకమైన ఉపకరణాలను గెలుచుకునే ప్రత్యేక అవకాశం ఉంటుంది.