
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం అంత ఈజీ కాదు. ఒక్క అవకాశం కోసం ఎందరో యువతులు ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొంటూ ఉంటారు. అవకాశం దక్కకపోతే, మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సిందే. అయితే, అటువంటి కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ సహనం, పట్టుదల ఉంటే తప్పకుండా విజయాన్ని అందుకోవచ్చు. తాజాగా, ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న ఓ అందాల తార తన కెరీర్ ప్రారంభంలో 100 సార్లు రిజెక్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఆమె ఎవరో తెలుసా? ప్రియా బాపట్. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా మరాఠీ సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసి తన ప్రతిభను నిరూపించుకుంది. ప్రియా చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. 1986లో ముంబయిలో జన్మించిన ప్రియా, “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్” అనే సినిమాతో 2000లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇకపై, సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ప్రియా బాపట్ కెరీర్‌కు బాలీవుడ్ “మున్నాభాయ్ MBBS” సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, ఆతర్వాత “లగే రహో మున్నాభాయ్” చిత్రంలో కూడా నటించింది. అయితే, ఆమె సినీ ప్రయాణం అంత సులభం కాదు. కెరీర్ ప్రారంభంలోనే అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. వందసార్లు రిజెక్ట్ అయినప్పటికీ, ధైర్యంగా ప్రయత్నిస్తూ చివరకు ఓ టీవీ యాడ్‌లో సెలెక్ట్ అయింది.
ప్రస్తుతం ప్రియా బాపట్ టాప్ లీడింగ్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఎన్నో విఫల ప్రయత్నాల తరువాత తన టాలెంట్‌ను నిరూపించుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ కథ ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్. జీవితంలో పట్టుదలతో ముందుకెళ్లాలనే సందేశాన్ని ప్రియా తన ప్రయాణంతో నిరూపించింది.