
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమా నుంచి మూడవ సింగిల్ “అది ది సర్ప్రైజ్” విడుదలైంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా, తాజా పాటపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా, ఈ పాట కేతిక శర్మ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కొన్ని ఆసక్తికరమైన, హాస్యభరితమైన సన్నివేశాలను హైలైట్ చేస్తుంది. జివి ప్రకాశ్ కుమార్ అందించిన హై-ఎనర్జీ మాస్ మ్యూజిక్ తో పాటు, వీణ, నాదస్వరం వాద్యాల సమ్మేళనం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ప్రత్యేక పాటలో కేతిక శర్మ తన అద్భుతమైన Jasmine Blouse డ్రెస్, ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్‌తో కనువిందు చేస్తోంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. థియేటర్లలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ పాట డిజైన్ చేశారు. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి తమ శక్తివంతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ముఖ్యంగా, అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం పాటకు మరో హైలైట్‌గా నిలుస్తోంది.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు అదనపు స్పెషల్ టచ్ తీసుకొచ్చింది. ఈ పాట చివర్లో నితిన్, శ్రీలీల కలిసి చేసిన డాన్స్ మువ్స్ మరో లెవెల్‌లో ఉన్నాయి. విడుదల దగ్గర పడుతుండటంతో, మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
రాబిన్ హుడ్ మార్చి 28న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ, వెంకీ కుడుముల మాస్ మేకింగ్, జివి ప్రకాశ్ సంగీతం – ఇవన్నీ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. “అది ది సర్ప్రైజ్” పాట ఇప్పటికే పెద్ద హిట్ అయ్యిందంటే, సినిమా విడుదలైతే ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!