‘రాబిన్‌హుడ్’ సర్‌ప్రైజ్ సాంగ్ వాయిదా..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 11, 2024 12:40 AM IST

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా నుండి ‘అదిదా సర్‌ప్రైజ్’ అనే ఐటెం సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. టెక్నికల్ సమస్య వల్ల ఈ పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వారు తెలిపారు.

ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *