గత కొద్ది రోజులుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తలెత్తిన వివాదంతో జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి పరిసరాలు అటు మంచు విష్ణు బౌన్సర్స్ తో ఇటు మంచు మనోజ్ బౌన్సర్స్ తో తిరునాళ్లలా మారింది. ఇరు వర్గాలు సినిమాల్లో మాదిరి పరస్పరం బాహాబాహీకి దిగి భయానక వాతావరణం సృష్టించారు. కాగా మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడం, అటు హై కోర్ట్ లో మోహన్ బాబుకు రక్షణ కల్పిచాలని, ప్రతి రెండు గంటల కోసారి మోహన్ బాబు ఇంటిని పోలీసులు పరిశీలించాలని తీర్పునిచ్చింది.
Also Read : Dhandoraa : లాంఛనంగా ప్రారంభమైన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘దండోరా’
దీంతో పోలీసులు మోహన్ బాబు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రైవేట్ వెహికిల్స్, ప్రైవేట్ సెక్యూరిటీ మొత్తాన్ని మోహన్ బాబు ఇంటివద్ద లేకుండా క్లియర్ చేసిన పోలీసులు. మూడు రోజుల తర్వాత జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. మరోవైపు సీపీ ఆఫీస్ నుంచి మనోజ్ ఇంటికి చేరుకున్నాడు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేస్తానన్న మీడియా సమావేశం కూడా రద్దు చేసాడు మనోజ్. కుటుంబ సభ్యులంతా కలిసి పంచాయితీ తెంచుకుంటామని సీపీ కి చెప్పిన మనోజ్. అలాగే కాంటినెంటల్ హాస్పిటల్ కి మనోజ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ క్షణమైనా మనోజ్ వచ్చే ఛాన్స్ ఉందని, హాస్పిటల్ వద్ద పోలీస్ బలగాలను మోహరించాయి . కాంటినెంటల్ హాస్పిటల్ వద్దకు చేరుకున్న రాచకొండ పోలీసులు పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్ట భద్రతలు ఏర్పాటు చేసారు.