ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా లవ్ మీ. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ లో దర్శకుడు అరుణ్ భీమవరపు రూపొందిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. కీరవాణి లవ్ మీ సినిమా కోసం ఓ ప్రయోగం చేశారు. ఈ సినిమాలోని ఘోస్ట్ లవ్ సాంగ్ ను కంపోజ్ చేయడానికి పూర్తిగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు.

ఈ పాట పాడటానికి కూడా ఏఐని ఉపయోగించడం విశేషం. ఇప్పటికే ఏఐ అన్ని రంగాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇది ఇప్పుడు సినిమా పరిశ్రమకూ చేరింది. ఈ టెక్నాలజీని లాల్ సలామ్, కీడా కోలా, హాయ్ నాన్న వంటి చిత్రాల్లో ఉపయోగించారు. అయితే పూర్తి స్థాయి ఏఐ పాటగా ఘోస్ట్ లవ్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఓ యువకుడు ఆడ దెయ్యాన్ని డేట్ కు పిలిస్తే ఆ దెయ్యం ఎలా రియాక్ట్ అయ్యింది అనే కాన్పెప్ట్ తో లవ్ మీ సినిమా రూపొందింది.