Aishwarya Rajesh Glam Look Goes Viral
Aishwarya Rajesh Glam Look Goes Viral

తమిళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఫుల్ డిమాండ్‌లో ఉంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతోనే నేచురల్ నటనతో అందరినీ ఆకట్టుకుంది. మామూలు గృహిణిలా కనిపించినా, నటనలో మాత్రం బోలెడంత మాయ చేస్తోంది.

విక్టరీ వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఈ బ్యూటీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఆమెకు ఒకేసారి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తెలుగు ప్రేక్షకులందరూ ఆమె పేరు వినిపించడమే కాకుండా, నిర్మాతలు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.

ఇంతకుముందు వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చిత్రాల్లో కనిపించినా, సరైన గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఐశ్వర్య ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫుల్ బిజీ షెడ్యూల్‌ మధ్యలో కూడా ఆమె ఫోటోషూట్స్‌కు కూడా టైమ్ కేటాయిస్తున్నారు. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో చేసిన గ్లామర్ ఫోటోషూట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె అందం, ఆత్మవిశ్వాసం, స్టైల్ మిక్స్‌తో హీటెక్కిస్తున్న ఈ లేటెస్ట్ లుక్, అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *