అజయ్ దేవగణ్ హీరోగా నటించిన మైదాన్ సినిమా విడుదల వాయిదాల్లో రికార్డ్ సృష్టించింది. రెండేళ్ల కిందటి నుంచి ఈ సినిమా దాదాపు 8 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. 2019లో మైదాన్ సినిమా మొదలైంది. మేకింగ్ లో ఆలస్యమవుతూ 2022లో రిలీజ్ అనుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యం వల్ల విడుదల వాయిదా పడింది. అలా ఇప్పటికి ఈ సినిమా విడుదలకు వస్తోంది. ఈ నెల 10న కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

అజయ్ దేవగణ్ తో పాటు ప్రియమణి, గిరిజారావ్ కీ రోల్స్ చేశారు. అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1950 దశకంలోని ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ గురించి. ఆ టీమ్ కు కోచ్ గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు ఎలాంటి గొప్ప విజయాలు అందించాడో ఈ సినిమాలో చూపించబోతున్నారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ హైదరాబాద్ వ్యక్తి. ఇతన్ని ఇండియన్ ఫుట్ బాల్ పితామహుడు అని పిలుస్తారు. కొన్నేళ్లపాటు ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు విజయాలు అందించాడు రహీమ్. ఇతని క్యారెక్టర్ లోనే అజయ్ దేవగణ్ నటించారు. ఇవాళ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.