
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, ఆయన “విదాముయార్చి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను తెలుగులో “పట్టుదల” అనే పేరుతో విడుదల చేశారు. అయితే, సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. కానీ అజిత్ స్టైల్, నటన మాత్రం ఫ్యాన్స్‌ను మెప్పించాయి.
ప్రస్తుతం అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజిత్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. అజిత్ ఫ్యాన్స్ ఈ సినిమాతో ఆయన సాలిడ్ హిట్ కొడతారని విశ్వాసంగా ఉన్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 25 ఏళ్ల తర్వాత అజిత్ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ రీ-ఎంట్రీ ఇస్తోందట!
ఆమె మరెవరో కాదు, నాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్! గతంలో అజిత్, సిమ్రాన్ కాంబినేషన్‌లో వచ్చిన “వాలి” మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటించలేదు. ఇప్పుడు, 25 ఏళ్ల విరామం తర్వాత “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో సిమ్రాన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది నిజమైతే, అజిత్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ఓ బిగ్ సర్‌ప్రైజ్ అవుతుంది. మరి, ఈ వార్తలో ఎంత నిజముందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.