Published on Dec 17, 2024 8:01 PM IST
తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో అజిత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తనదైన మార్క్ సక్సెస్‌ను అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ‘విదాముయార్చి’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోందని.. ఈ షూటింగ్‌లో హీరో అజిత్‌తో పాటు స్టార్ బ్యూటీ త్రిష కూడా పాల్గొంటుందని వారు సెట్స్ నుండి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు.
ఈ ఫోటోల్లో అజిత్, త్రిష కాంబినేషన్ సూపర్‌గా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా, ఆరవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.