తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’పై కోలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పోస్టర్స్‌తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా, హీరో అజిత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ మేరకు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మాగిజ్ తిరుమేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటించగా అర్జున్, రెజీనా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The post ‘విదాముయార్చి’ డబ్బింగ్ పూర్తి చేసిన అజిత్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.