Ajith Kumar Pays Tribute to F1 Legend Ayrton Senna

సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఫ్యాన్స్‌ను గర్వపడే another moment. నటనతో పాటు కార్ రేసింగ్ పట్ల ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. ఇటీవలే రెండు సినిమాలతో హిట్ కొట్టిన అజిత్, ఇప్పుడు ఇటలీలో కార్ రేసింగ్ కోసం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్స్పిరేషన్ అయిన ఫార్ములా 1 లెజెండ్ అయర్టన్ సెన్నా విగ్రహానికి పాదాలకు ముద్దు పెట్టి నివాళులు అర్పించారు.

ఇటలీలోని ఓ పార్కులో ఉన్న సెన్నా విగ్రహాన్ని చూసి అజిత్ చాలాసేపు మౌనంగా నిలిచిపోయారు. స్టార్ హీరో అనే గర్వం లేకుండా, ఫ్యాన్‌లా ముద్దుపెట్టి తన నిజమైన అభిమానాన్ని చాటారు. ఈ ఘట్టం చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అభిమానులు అజిత్ నమ్రతను చూసి ఫిదా అవుతున్నారు.

అయర్టన్ సెన్నా బ్రెజిల్ దేశానికి చెందిన రేసింగ్ లెజెండ్. 1988, 1990, 1991లో వరుసగా మూడు సార్లు ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. 1994లో రేసింగ్ ప్రమాదంలో మరణించిన ఈ గ్రేట్ డ్రైవర్ జ్ఞాపకార్థం ఇటలీలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించబడిన అజిత్ కుమార్, ఇప్పుడు తన ఐడల్‌కు ఇలా గౌరవం చూపడంతో మనిషిలో ఉన్న గొప్పదనం మరోసారి వెలుగులోకి వచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *