- అజిత్ తాజా చిత్రం విదాముయార్చి
- కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
- సంక్రాంతి కానుకగా రిలీజ్ ఫిక్స్
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.
Also Read : Pushpa -2 : హిందీ మూడు రోజుల కలెక్షన్స్.. ఊచకోత.!
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ పై అనుమానం నెలకొంది. అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బాడ్ అగ్లీ పొంగల్ కు వస్తుందనే టాక్ కూడా వినిపించింది. కానీ ‘విదాముయార్చి’ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను చక చక ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే హీరో అజిత్ తన పాత్రకు డబ్బింగ్ ను అజర్‌బైజాన్ లోని బాకులో ఫినిష్ చేస్తూ ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ‘విదాముయార్చి’ సంక్రాంతి రిలీజ్ కు ఫిక్స్ అనే మాట వినిపిస్తోంది. అటు మైత్రీ వాళ్ళు కూడా తమ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ లో ఉన్నారు. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘విదాముయార్చి’సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అంటున్నారు.
దర్శకుడి మాగిజ్ ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.