Akhanda 2 : అఖండ 2 నుంచి సాలీడ్ అప్ డేట్.. ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

  • డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య
  • త్వరలో అఖండ 2 షూటింగులో నందమూరి నటసింహం
  • నేడు సాలీడ్ అప్ డేట్ ఇవ్వనున్న మేకర్స్

Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఆయన తన కెరీర్లో 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. “డాకు మహారాజ్” పేరుతో తెరకెక్కుతున్న ఈ మాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ని కూడా బాలకృష్ణ ఆల్రెడీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2” రాబోతుంది. హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై కూడా భారీ హైప్ ఉంది. బాలయ్య అలా డాకు మహారాజ్ పూర్తి చేసిన వెంటనే అఖండ 2 లోకి దిగిపోయినట్టు తెలుస్తుంది.

Read Also:RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి

దీనితో వెంటనే అఖండ 2 పనులను తాను స్టార్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ క్రేజీ అప్డేట్ ఇస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ వారు తెలిపారు. మరి ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం కూడా అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి తన డాకు మాహారాజ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇంకో వైపు ప్రమోషన్స్ ప‌నులు సైతం మొద‌లు పెట్ట‌డానికి టీమ్ రెడీ అవుతుంది. బాల‌య్య కూడా అవ‌స‌రం మేర సెట్స్ కి వెళ్తున్నారు. ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు విజ‌యాలు న‌మోద‌య్యాయి. అఖండ 2తో డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.

Read Also:Spirit : స్పిరిట్ లో ప్రభాస్ లుక్ చూశారా.. అరాచకమే.. బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయం

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *