
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. జైనాబ్ రవ్‌జీ తో గతేడాది నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, మార్చి 24, 2025న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవనుందని సమాచారం. అక్కినేని అభిమానులు ఆతృతగా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇరు కుటుంబాలు ఇప్పటికే వివాహ ఏర్పాట్లు పూర్తి చేశాయని తెలుస్తోంది.
ఇటీవల అఖిల్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొని “Naatu Naatu” పాటకు డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ (Black and Black) డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో మెరిసిన అఖిల్, తన ఫ్రెండ్‌తో కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులు వేశారు. అయితే చివరిలో ఆకస్మాత్తుగా కిందపడిపోయాడు. అది రామ్ చరణ్ స్టెప్‌ను ఫాలో అవ్వాలనుకున్నాడా లేక నిజంగా స్లిప్ అయ్యాడా అన్నదానిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, అఖిల్ తన నెక్ట్స్ మూవీ పనుల్లో కూడా శ్రద్ధ చూపిస్తున్నాడు. అతను “ధీర” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు, UV Creations నిర్మిస్తోంది. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో కీలక ప్రాజెక్ట్‌గా మారనుంది.
వివాహం, కొత్త సినిమా.. ఇలా 2025 అఖిల్ అక్కినేనికి చాలా స్పెషల్ ఇయర్ కానుంది.