ఫోటో మూమెంట్: కొత్త జంటతో అక్కినేని ఫ్యామిలీ పిక్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 5, 2024 11:30 PM IST

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు, పలువురు ప్రముఖుల సమక్షంలో చైతూ-శోభిత మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ నూతన వధూవరులను ఆశీర్వదించారు పెళ్లికి హాజరైన వారు.

అయితే, తమ ఇంట్లో ఓ వేడుక జరుగుతుందని.. తమ కుటుంబానికి చెందిన విషయం కావడంతో ఎలాంటి మీడియా వారిని అక్కడికి ఆహ్వానించలేదు. చైతూ-శోభిత పెళ్లి అంతా సవ్యంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా కొత్త జంటతో అక్కినేని కుటుంబ సభ్యులు ఓ ఫ్యామిలీ పిక్ తీసుకున్నారు. దీన్ని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు దీన్ని వైరల్ చేస్తూ చైతూ-శోభితకు విషెస్ చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *