
భోజ్‌పురి స్టార్ అక్షర సింగ్ తాజాగా తన వ్యక్తిగత జీవితం, సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలు, మరియు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 6.7 మిలియన్ ఫాలోవర్లు కలిగిన అక్షర, గతంలో భోజ్‌పురి హీరో పవన్ సింగ్ తో ప్రేమలో ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత అనేక ఇంటర్వ్యూలలో పవన్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.
భోజ్‌పురి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ,
“ప్రతి రంగంలోనూ దోపిడీ ఉంది. సినీరంగంలో రాజీపడకపోతే, ఏ శక్తీ మిమ్మల్ని బలవంతం చేయలేను. కానీ చాలా మంది రాజీపడతారు. అసలు ప్రశ్న అదే—మీరు ఎందుకు రాజీపడాలి?” అని అక్షర వ్యాఖ్యానించింది. అవకాశాలు రాకపోతే ఏం చేయాలి? అని అడిగితే, అక్షర ఆత్మవిశ్వాసం, అసలు టాలెంట్ ఉంటే సక్సెస్ ఖాయం అంటూ ధైర్యం ఇచ్చింది.
అలాగే సినీరంగంలో ప్రేమ, విబేధాలు గురించి మాట్లాడుతూ,
“ఒక అమ్మాయి ప్రేమలో పడితే, విడిపోయిన తర్వాత తప్పంతా ఆమెపైనే వేస్తారు. కానీ ప్రేమలో అందరూ మోసపోవచ్చు, ఇది సహజం” అంటూ చెప్పింది. ఆమె ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో భోజ్‌పురి సినీ పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సమస్యలపై పెద్ద చర్చ మొదలైంది. అయినప్పటికీ, అక్షర టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తన బోల్డ్ స్టేట్‌మెంట్స్, గ్లామర్, అభినయం ద్వారా అక్షర సింగ్ ఇండస్ట్రీలో మరింత పాపులర్ అవ్వబోతోంది.