ఇటీవలి కాలంలో AI technology విస్తృతంగా వాడుకలోకి రావడంతో, నిజమైన వార్తలు ఏవి? ఫేక్ కంటెంట్ ఏది? అన్నది తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త viral video సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పై కూడా ఓ ఫేక్ ట్రైలర్ వైరల్ అవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ వీడియోలో అక్షయ్ కుమార్ మహర్షి వాల్మీకి పాత్రలో నటిస్తున్నట్లు చూపించారు. కానీ, ఈ వీడియో నిజం కాదని, ఇది పూర్తిగా AI generated content అని అక్షయ్ స్పష్టత ఇచ్చారు. “ఇలాంటి వీడియోలు మూడు రకాలుగా తయారయ్యాయి. నిజానికి నేను అలాంటి సినిమా చేయడం లేదు” అని అక్షయ్ క్లారిటీ ఇచ్చారు.
అతను ఇంకా, కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా ఈ fake trailer ను పరిశీలించకుండా వార్తగా చూపించడం విచారకరమని అన్నారు. “వార్తలను ధృవీకరించకుండా ప్రచురించడం అనేది బాధ్యతారాహిత్యం. ఫేక్ కంటెంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో జర్నలిస్టులు జాగ్రత్త వహించాలి” అని ఆయన హితవు పలికారు.
చివరగా, తన అభిమానులకు అక్షయ్ కుమార్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. “అలాంటి వీడియోలను నిజమని నమ్మవద్దు. fake news విని గందరగోళం చెందకండి” అని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం AI ఫేక్ కంటెంట్ పెరిగిపోతున్న నేపథ్యంలో, సెలబ్రెటీలు మరియు మీడియా రెండూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.