
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్నాడు. ఇటీవలే సలార్ మరియు కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం, రాజాసాబ్, సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ప్రభాస్, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
హనురాఘపూడి దర్శకుడిగా తన అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, లై, పడి పడి లేచె మనసు వంటి సినిమాలతో విజయాలను అందుకున్నాడు. సీతారామం సినిమా కూడా అతని పేరు మళ్లీ మరింత ప్రముఖంగా చేసింది. ఇప్పుడు, ప్రభాస్ తో సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హనురాఘపూడి, ఈ ప్రాజెక్టుకు పౌజి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వీ నటించనున్నారు. మొదట్లో ప్రేక్షకులకు పెద్దగా తెలియని ఇమాన్వీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి, ఒక పెద్ద స్టార్‌గా మారిపోయింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన మరొక సంచలన వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ కూడా ఈ సినిమాలో మహారాణి పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది, మరియు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.