Jigra Hindi Movie Review, Alia Bhatt, Vedang Raina

విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : ఆలియా భట్, వేదాంగ్ రైనా, మనోజ్ పాహ్వ, రాహుల్ రవీంద్రన్ తదితరులు

దర్శకుడు : వాసన్ బాల

నిర్మాతలు : కరణ్ జోహర్, ఆలియా భట్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సోమెన్ మిశ్రా

సంగీత దర్శకుడు : అచింత్ థాకర్, మన్‌ప్రీత్ సింగ్

సినిమాటోగ్రఫీ : స్వప్నిల్ ఎస్. సోనావానె

ఎడిటర్ : ప్రేర్ణా సైగల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా’ భారీ అంచనాల మధ్య నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతేమేర ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
సత్యభామ ఆనంద్(ఆలియా భట్) తన సోదరుడు అంకుర్ ఆనంద్(వేదాంగ్ రైనా)ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఉన్నత చదువుల కోసం తన కజిన్ హన్సి దావో తో కలిసి అంకుర్ మలేషియా వెళ్తాడు. అయితే, అక్కడ అనునకోని విధంగా డ్రగ్స్ కేసులో వారిద్దరికీ మరణశిక్ష పడుతుంది. ఓ భారీ సెక్యూరిటీ ఉన్న జైలులో వారిద్దరినీ ఖైదు చేస్తారు. దీంతో ఎలాగైనా తన సోదరుడిని తిరిగి ఇండియా తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది ఆలియా. మలేషియాలో ఆమెకు భటియా(మనోజ్ పహ్వ) పరిచయమవుతాడు. అతడి కుమారుడు కూడా జైలులో ఉంటాడు. దీంతో వారిద్దరికీ ముత్తు(రాహుల్ రవీంద్రన్) అనే ఎక్స్ కాప్ సహాయం చేస్తాడు. మరి వారిద్దరినీ జైలు నుంచి తప్పించారా..? దీని కోసం వారు ఎలాంటి ప్లాన్ వేశారు..? ఆలియా తన సోదరుడిని ఇండియాకి తీసుకువస్తుందా..? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
తన సోదరుడిని కాపాడుకోవాలనే అక్క పాత్రలో ఆలియా భట్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాలోని క్లైమాక్స్ సీక్వెన్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్‌లో ఆలియా ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి.

వేదాంగ్ రైనా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు. మనోజ్ పహ్వ, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:
ఆసక్తికరమైన కథనాన్ని ఆశించే ప్రేక్షకులను ‘జిగ్రా’ చిత్రం డిజప్పాయింట్ చేస్తుంది. ట్రైలర్ చూసిన వారికి సినిమా కథ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. సినిమాలోని పేస్, ఎమోషనల్ బాండింగ్ వంటి అంశాలు అసంపూర్తిగా కనిపిస్తాయి. దీంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.

ఆకట్టుకునే డైలాగులు, ఎంగేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు లేకపోవడంతో ఈ సినిమా రన్‌టైమ్ చాలా ఎక్కువగా అనిపించేలా చేయడమే కాకుండా.. ఎండ్ టైటిల్ కార్డ్ ఎప్పుడెప్పుడు పడుతుందా అని ప్రేక్షకులు చూసేలా చేస్తుంది.

సాంకేతిక విభాగం:
దర్శకుడు వాసన్ బాల ఓ చక్కటి ఎంగేజింగ్ కథనాన్ని ప్రెజెంట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆలియా భట్ వంటి స్టార్ ఉన్నప్పుడు మరింత పవర్‌ఫుల్ కథను రాసుకుని, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసుకుని ఉంటే, ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేది. ఈ చిత్రానికి రైటింగ్ చాలా వీక్‌గా ఉండటంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతారు.

స్వప్నిల్ ఎస్. సోనావానె సినిమాటోగ్రఫీ బాగున్నా.. ప్రేర్ణా సైగల్ ఎడిటింగ్ వర్క్ సినిమాకు డ్యామేజ్ చేసింది. అచింత్ థాకర్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, నిర్మాణ విలువలు గ్రాండ్‌గా కనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది.

తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే.. ఆకట్టుకునే అంశాలు, లోతైన ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో ‘జిగ్రా’ చిత్రం ఓ బోరింగ్ యాక్షన్ డ్రామాగా మిగలింది. ఆలియా భట్ పర్ఫార్మెన్స్ మినహా ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. ఆకట్టుకునే సినిమాను చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *