Published on Dec 5, 2024 5:01 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇపుడు లోకల్ కాదు నేషనల్ అని అందరికీ తెలిసిందే. తన సొంతంగా సంపాదించుకున్న ‘పాన్ ఇండియా క్రేజ్’ తో ఐకాన్ స్టార్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అయ్యాడు. అయితే మన తెలుగు స్టేట్స్ కోసం పక్కన పెడితే నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. అప్పుడు పార్ట్ 1 కే అలాంటి కోవిడ్ పరిస్థితుల్లో కూడా థియేటర్స్ కి జనాన్ని పరుగులు పెట్టించి 100 కోట్ల వసూళ్లు బన్నీ సాధించి దుమ్ము లేపాడు.
ఇక పార్ట్ 2 వసూళ్లు వేరే లెవెల్లో ఉంటాయని అపుడు నుంచే కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇలా ఫైనల్ గా పుష్ప 2 హిందీ మార్కెట్ లో భారీ రిలీజ్ కి అది కూడా మాసివ్ బుకింగ్స్ తో వచ్చింది. ఇదే కాకుండా హిందీలో జరిగిన బిజినెస్ తో కూడా పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకంగా ఈ చిత్రం ఒక్క ఇండియన్ హిందీ మార్కెట్ లోనే అక్కడి స్టార్స్ సినిమా ఓపెనింగ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది ట్రేడ్ పండితులు చెబుతూ వచ్చారు.
ఇక ఎట్టకేలకి రిలీజ్ కి వచ్చేసిన ఈ చిత్రం హిందీలో ఉన్న రికార్డ్స్ 65 కోట్లకి పైగా నెట్ వసూళ్ళతో షారుఖ్ “జవాన్” నిలవగా దీని తర్వాత రణబీర్ అనిమల్ సినిమా 54 కోట్లకి పైగా టాప్ 2 లో ఉంది. మరి వీటిని దాటి పుష్ప 2 సెన్సేషన్ సెట్ చేస్తుందో లేదో అని అందరి కళ్ళు పుష్ప 2 డే 1 నార్త్ ఇండియా వసూళ్లు ఎలా ఉంటాయో అని అందరి కళ్ళు దీని కోసమే చూస్తున్నాయి.