NTRNeel : రంగం సిద్ధం.. సెట్స్ పైకి ‘ఎన్టీఆర్-నీల్’ సినిమా

దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా టైగర్ ప్లాన్ చేస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16 నుంచి మంగళూరులో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మేకర్స్ నుంచి ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ  ఈ న్యూస్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది.

ఈ సినిమా  2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదేవరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కంప్లీట్ చేసే పనిలో  ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ‘వార్ 2’ పూర్తి కావడంతో ఫిబ్రవరిలో నీల్ మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు తారక్.  అసలే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్  డేట్ వేశారు. ఇప్పటి నుండి జెట్ స్పీడ్‌టో షూటింగ్  చేస్తే గాని అప్పటికి సినిమా ఫినిష్ అవదు. లేదంటే డిలే అవడం గ్యారెంటీ. అసలే ఈ ప్రాజెక్ట్ పై ఎక్కడా లేని అంచానలున్నాయి. పైగా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి  బాక్సాఫీస్‌ బద్దలు కొడుతుందని  వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *