ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన లాస్ట్ సినిమా పుష్ప 1 కి నార్త్ మార్కెట్ లో భారీ వసూళ్లు అందుకోగా ఇపుడు పార్ట్ 2 తో అయితే ఏకంగా అక్కడ స్టార్స్ తాలూకా ఆల్ టైం రికార్డ్స్ కి బన్నీ ఎసరు పెట్టాడు. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన పుష్ప 2 ఇపుడు హిందీలో ఉన్న ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇండియా వైడ్ గా హిందీ నుంచి షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 65 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకోగా ఇపుడు దీనిని పుష్ప 2 బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. మరి లేటెస్ట్ గా పుష్ప 2 హిందీ వరకే 67 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసినట్టుగా హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పుష్ప 2 దెబ్బతో నార్త్ మార్కెట్ లో తెలుగు హీరో ఖాతాలో మరో ఆల్ టైం రికార్డ్ పడింది అని చెప్పాలి.
The post హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్..”పుష్ప 2″ కి షాకింగ్ ఓపెనింగ్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.