Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో ట్విస్ట్.. కేసు విత్ డ్రా?

హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను 11వ నిందితుడిగా చేర్చారు పోలీసులు. నాలుగు సెక్షన్లు నమోదు చేయగా అందులో రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా చెబుతున్నారు. అయితే ఒకపక్క అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా ఆయనకు రిమాండ్ కూడా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు పోలీసులు. అయితే ఈ సమయంలో తొక్కిసలాటలో మరణించిన రేవతి భర్త మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నా కొడుకు మూవీ చూస్తానంటే ఆరోజు సంధ్య థియేటర్లో టికెట్లు తీసి థియేటర్కు తీసుకువెళ్లాను.

Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్.. రోప్ పార్టీని సిద్ధం చేసుకున్న పోలీసులు?

మూవీ చూస్తానంటేనే తీసుకు వెళ్లాను, అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్ప ఏమీ లేదు. ఏమైనా ఉంటే మేము కేసు విత్ డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఈ న్యూస్ కూడా పోలీసు వాళ్ళు నాకు ఏమీ ఇన్ఫామ్ చేయలేదు. అరెస్ట్ చేసినట్లు నేను ఇప్పుడు మొబైల్ లో చూశాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ లో చూసి మాట్లాడుతున్నాను. అల్లు అర్జున్కి ఇందులో ఏమి సంబంధం లేదు, ఏమైనా ఉంటే నేను కేసు విత్ డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మీదనే ఈ కేసు రిజిస్టర్ చేశారా? తొక్కిసలాట క్రమంలో సుమోటోగా కేసు నమోదు చేశారా? అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *