Published on Oct 26, 2024 11:10 AM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక్క తెలుగు లోనే కాకుండా దక్షిణాదిలో మరిన్ని భాషల్లో అలాగే అటు నార్త్ మార్కెట్ లో కూడా తనకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది అని తెలిసిందే. ఇన్నేళ్ల సినిమాల్లో ఒక్క పుష్ప తప్ప మరో హిందీ రిలీజ్ కి తన సినిమా థియేట్రికల్ గా వెళ్ళలేదు. అయినప్పటికీ అల్లు అర్జున్ కి నార్త్ ఆడియెన్స్ లో వచ్చిన క్రేజ్ మరో హీరోకి అయితే డ్రీం అనే చెప్పాలి.
చాలా మంది యూట్యూబ్ వ్యూస్ చూసి అల్లు అర్జున్ సినిమాకి థియేటర్స్ కి ఎవరూ రారు అని పొరపాటు పడి ఉండొచ్చు కానీ ఇప్పుడు పుష్ప 2 పట్ల హిందీ మార్కెట్ లో నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. అయితే ఇది అల్లు అర్జున్ బ్రాండ్ మీదే నడుస్తుండగా ఇప్పుడు నార్త్ సినిమా మార్కెట్ లో తన క్రేజ్ ఏ లెవెల్లో ఉంది అంటే అక్కడి రానున్న హిందీ సినిమాలకి సైతం తన కటౌట్స్ పెట్టి సింగిల్ స్క్రీన్స్ కి జనాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది మాత్రం దక్షిణాది హీరోల్లో ఎవరికైనా చెల్లింది అంటే అది బన్నీ ఒక్కడికే చెల్లింది అని చెప్పాలి. దీనితో హిందీ మార్కెట్ లో బన్నీ క్రేజ్ అండ్ డామినేషన్ ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే పుష్ప 2 రిలీజ్ నాటికి నార్త్ ఇండియా అంతా షేక్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ రూలే అని చెప్పాలి.