ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప-2’ ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో సందడి చేస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ మూవీ ఇండియన్ రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటంతో కొందరు హేటర్స్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
అంతేగాక, కొందరు అల్లు అర్జున్ అభిమానులం అంటూ పలు టీవీ డిబేట్ లు, యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ వారికి నచ్చింది మాట్లాడుతున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ అభిమానులు ఎవరూ ఇలా టీవీ డిబేట్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని.. ఒకవేళ వారు అలా చేస్తున్నారంటే అది వారి సొంత అభిప్రాయం కిందే పరిగణించాలి. బన్నీ అభిమానులతో వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇతర హీరోల అభిమానులకు తమకు మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు గ్రూపులుగా మారి ఇలా చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
The post ప్రేక్షకులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లారిటీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.