Published on Dec 11, 2024 10:09 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి బాక్సాఫీస్ లెక్కలు తిరగరాస్తుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కాగా, ఈ మూవీ ప్రీమియర్స్‌ను కూడా భారీగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రీమియర్స్ రోజు సంధ్య 70 ఎంఎం వద్ద జరిగిన విషాదం పుష్ప-2 యూనిట్‌ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
అయితే, ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు ఇస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.