- చిరు ఇంటికి అల్లు అర్జున్..
- ఆ అంశాలపై చర్చ?
- వివరాలు ఇలా.
Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: MPs Cricket Match: రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్‌సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్.. సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్
అల్లు అర్జున్ ఆరెస్ట్ తర్వాత నుండి మెగా ఫ్యామిలీ బన్నీకి పలు రకాలుగా మద్దతుగా నిలిచింది. చిరంజీవి స్వయంగా బన్నీ ఇంటికి వెళ్లి పరిణామాల గురించి తెలుసుకున్నారు. తన షూటింగ్ షెడ్యూల్ రద్దు చేసి బన్నీకి మద్దతుగా నిలబడ్డారు. దీనికి కృతజ్ఞతగా బన్నీ ఆదివారం చిరు ఇంటికి వెళ్లి తన మావయ్య (మెగాస్టార్ చిరంజీవి) కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన పుష్ప-2 విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించినట్లు సమాచారం. ఈ సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య అనేక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, ఈ సమయంలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు అక్కడ లేనట్లు తెలిసింది.
Also Read: Poco X7Series: ఐరన్ మ్యాన్ థీమ్‌తో ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌ను తీసుకురాబోతున్న పోకో
అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ పలువురు ప్రముఖుల పరామర్శలతో బిజీగా గడిపారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా బన్నీని పరామర్శించారు. ఈ పరిణామాలు బన్నీకి అందుతున్న మద్దతును స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల సమయంలో మెగా ఫ్యామిలీ సమైక్యతను చాటుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.