Allu Arjun : ‘పుష్ప-2’ నా విక్టరీ కాదు.. ఇండియా విక్టరీ

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది.  మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.

Also Read : SDT 18 : సాయి దుర్గాతేజ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది

ఈ సందర్భంగా  అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ” నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్‌. భారతీయులందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యే క ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ. ఒక సినిమాను అన్ని రాష్ట్రాల ప్రజలు సెలబ్రేట్‌ చేశాయి. ఇదనే నా దేశం గొప్పతనం. ఇక ఈ సినిమాను ఆదరిస్తున్న అన్నిరాష్ట్రాల సినీ పరిశ్రమలకు, అక్కడి సినీ ప్రముఖులకు, ప్రభుత్వాలకు, పోలీసులకు, మీడియా వాళ్లకు నా థాంక్స్‌. ముఖ్యంగా పుష్ప-2 సినిమాను మరింత ప్రేమతో, అత్యధిక వసూళ్లతో ఆదరిస్తున్న హిందీ సినీ ప్రేక్షకులకు నా మనస్పూర్తిగా థాంక్స్‌, ఇక ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌దే. ఆయన విజన్‌, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ చిత్రం. ఇక ఈ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేయడం ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. అయితే ఈ నెంబర్స్‌ టెంపరరీ. ఎందుకంటే భవిష్యత్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా ఈ నెంబర్స్‌ను క్రాస్‌ చేస్తుంది. కానీ ఆడియన్స్‌ ఇచ్చే లవ్‌ మాత్రం శాశ్వతం. వాళ్లు నా పై చూపిస్తున్న వైల్డ్‌ ప్రేమకు జీవితాంతం బుణపడి ఉంటాను’ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *