సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
పోలీసులు నిర్దేశించిన టైమ్ కు అల్లుఅర్జున్ చిక్కపల్లి పోలిస్ స్టేషన్ హాజరయ్యాడు. బన్నీ తోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా బన్నీ తో పాటు కారులో బయలుదేరారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 11వ ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను నేడు రికార్డింగ్ చేయనున్నారు పోలీసులు. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తాలూకు దృశ్యాలు అల్లు అర్జున్ కు చూపించనున్నారు. అయితే చిక్కడపల్లి పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఏం చెబుతాడన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి కూడా చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారుయు. వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలుఅమలు చేసారు.