- చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల..
- జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్..
- జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయం..
- అక్కడి నుంచి నివాసానికి అల్లు అర్జున్ చేరుకునే అవకాశం
Allu Arjun: హీరో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి ఈరోజు ఉదయం 6.30 గంటలకు విడుదల అయ్యారు. చంచల్‌గూడ జైలు వెనుక గేట్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక, అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అర్జున్, మామ చంద్రశేఖర్ ఉన్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్, సహా పలువురు ఉన్నారు. మరి కాసేపట్లో తన నివాసానికి చేరుకోనున్నారు. దీంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర హడావుడి కొనసాగుతుంది.
Read Also: Ganja Seized : మెదక్‌లో 800 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
కాగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే, ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ లాయర్లు 50 వేల రూపాయల పూచీకత్తును చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. అలాగే, హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందించడంతో.. అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, నేటి ఉదయం చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోయారు.