Allu Arjun: ఇది ఒక యాక్సిడెంట్, ఎవరి తప్పులేదు!

  • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం
  • ఇది ఒక యాక్సిడెంట్.. ఇందులో ఎవరిది తప్పులేదు
  • అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది
  • ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం
  • ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా. -అల్లు అర్జున్‌.

మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇది చాలా దురదృష్టకరమైన యాక్సిడెంట్. నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెక్షన్ నుంచి ఉన్న అందరూ ఇక్కడికి వచ్చింది ఒక మంచి ఆలోచనతోనే. సినిమా అందరం కలిసి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా సరే ఇది యాక్సిడెంట్. ఇది పూర్తిగా యాక్సిడెంట్ అని నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను. యాక్సిడెంట్ జరిగినందుకు నేను ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. జరిగింది చాలా చాలా దురదృష్టకరమైన విషయం.

Kuwait: అరబిక్‌లోకి రామాయణం.. ట్రాన్స్‌లేటర్‌ను అభినందించిన మోడీ

ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయం జరిగినందుకు. ఒక సినిమా వ్యక్తిగా నా జీవిత ఆశయమే థియేటర్కు వచ్చిన వ్యక్తులను ఎంటర్టైన్ చేయాలి అని. థియేటర్ కి వచ్చిన మీ అందరిని నవ్వుతూ పంపించాలి అనేది నా కోరిక. మీ మనసులను గెలిచి పంపించాలి అనుకునే మనిషిని నేను. నాకు థియేటర్ ఏ దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే నాకంటే బాధపడేవాడు ఎవరైనా ఉంటారా? నాకు నిజంగా బాధగా ఉంది. ఆ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను.. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి నేను గంట గంటకు వివరాలు తెలుసుకుంటున్నాను. మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు కొంత మెరుగవుతుంది. బాలుడు కదులుతున్నాడు అని చెప్పుకొచ్చారు.. ఇన్ని దారుణమైన విషయాల్లో అది కాస్త ఆనందం కలిగించే విషయం అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *