- పోలీసులు వచ్చే సమయానికి స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్
- పోలీసుల రాకతో అవాక్కైన బన్నీ
- కేసు హైకోర్టులో ఉన్నందున అరెస్ట్ ఊహించని అల్లు అర్జున్
తనను అరెస్టు చేయడానికి తన నివాసానికి వచ్చిన పోలీసులను చూసి అల్లు అర్జున్ షాక్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నివాసానికి చేరుకుని ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానంకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలోనే పోలీసులు నివాసానికి వచ్చారు. దీంతో అల్లు అర్జున్ షార్ట్ లోనే వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారనే విషయం తెలిసి అల్లు అర్జున్ అవాక్కైనట్లుగా తెలుస్తోంది.
Allu Arjun: నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్?
నిజానికి సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ పేరుని కూడా పోలీసులు కేసులో చేర్చారు. ఈ నేపథ్యంలో తన పేరును ఆ కేసు నుంచి తొలగించాల్సిందిగా అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టులో కేసు ఉండడంతో తనను అరెస్టు చేయరు అని అల్లు అర్జున్ భావిస్తూ వచ్చారు. కానీ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వచ్చారు అనే విషయం తెలిసి ఆయన షాక్ కి గురైనట్లుగా తెలుస్తోంది. ఇక నాంపల్లి కోర్డుకి అల్లు అర్జున్ ను తరలించారు పోలీసులు. ఇక ప్రస్తుతానికి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలిస్తున్న మేజిస్ట్రేట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.